జీ5 కొత్త వెబ్ సిరీస్ 'పులి-మేక' షూట్ షురూ!
on Jun 18, 2022

లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ లీడ్ రోల్స్ పోషిస్తున్న 'పులి-మేక' వెబ్ సిరీస్ షూటింగ్ మొదలైంది. జీ5 నిర్మిస్తోన్న ఈ సిరీస్‌కు కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మాణ భాగస్వామి. గోపీచంద్‌తో 'పంతం' మూవీ తీసిన కె. చక్రవర్తిరెడ్డి ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న దీని పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. లావణ్య, ఆదిపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు డైరెక్టర్ బాబీ క్లాప్ కొట్టగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ చేశారు.
సుమన్, సిరి హన్మంత్, ముక్కు అవినాశ్ కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ సిరీస్ గురించి నిర్మాతలు మాట్లాడుతూ, "ఈ మధ్య వెబ్ సిరీస్ లు కూడా సినిమాలతో పోటీ పడుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా వెబ్ సిరీస్‌లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో సినిమా హీరోలు సైతం వెబ్ సిరీస్‌లలో నటించడానికి ముందుకు వస్తున్నారు. ఈ 'పులి - మేక' సిరీస్ లో లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సుమన్ తదితరులు నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కథ విషయానికి వస్తే పోలీసు డిపార్ట్‌మెంట్ చుట్టూ తిరిగే థ్రిల్లర్ కథ ఇది. పోలీసులను టార్గెట్ చేసి ఒకరి తర్వాత ఒకరిని చంపుతున్న ఒక సీరియల్ కిల్లర్ నేపథ్యంలో థ్రిల్లర్ అంశాలు మరియు ఆస్ట్రాలజీతో మిళితమైన కథాంశం ఉండటం ఈ వెబ్ సిరీస్ కథలో ఉన్న ప్రత్యేకత ఇప్పటి వరకు వచ్చిన వెబ్ సిరీస్ లాగే ఇది కూడా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది." అన్నారు.
ఈ సిరీస్‌కు కథ: కోన వెంకట్, వెంకటేశ్ కిలారు, మ్యూజిక్: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: సూర్య కళా, ఎడిటర్: చోటా కె. ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: గిరిధర్ మామిడిపల్లి, కౌముది నేమాని, దర్శకత్వం: చక్రవర్తి రెడ్డి కె., బ్యానర్స్: ZEE5, కోన ఫిల్మ్ కార్పోరేషన్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



