‘రాఖీ కట్టేస్తా!’అని బెదిరించిందట!
on Sep 4, 2017
ప్రేమించినమ్మాయ్ రాఖీ కడతానంటే.. ఇక ఆ ప్రేమికుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. పాపం.. దారుణం కదా! ముక్కూమొహం తెలీని అమ్మాయి వచ్చి రాఖీ కడితేనే.. కుర్రాళ్లు విలవిలలాడిపోతారు. అలాంటి ప్రేమించిన అమ్మాయే స్వయంగా వచ్చి నీకు రాఖీ కట్టేస్తాను అంటే.. ఇక ఆ బాధ మాటల్లో వర్ణించలేం. ఇలాంటి పరిస్థితి ఎదురైంది ఎవరో తెలుసా? ఇంకెవరికీ మన నాగచైతన్యకే. సమంత, చైతూ ప్రేమలో మునిగి తేలుతున్న రోజుల్లో జరిగిందా సంఘటన. మనోడు... తాము ప్రేమించుకుంటున్న విషయాన్ని ఇంట్లో చెప్పకుండా నాన్చుతున్నాడట. దాంతో సమంతకు చిర్రెత్తుకొచ్చి... ‘నువ్వు ఇంట్లో విషయం చెబుతావా? లేక రాఖీ తీసుకొచ్చి కట్టేయమంటావా?’ అనేసిందట. దాంతో చైతూకి గుండేగినంత పనైదట. ఇక ఆలస్యం చేయకుండా ఇంట్లో చెప్పేసి, శుభం అనిపించేశాడట. ‘యుద్ధం శరణం’ సినిమా ప్రమోషన్లో భాగంగా గతానుభూతుల్ని నెమరేసుకున్నాడు చైతు. అక్టోబర్ 6న... నాగచైతన్య, సమంత పెళ్లితో ఒకటవుతున్న విషయం తెలిసిందే. ‘యుద్ధం శరణం’ సినిమా ఈ నెల 8న సినిమా విడుదల కానుంది. ఈ హడావిడీ ముగిశాక... పెళ్లి హడావిడి మొదలవుతుందని చైతూ తెలిపాడు.