ఇది అంతం కాదు ఆరంభం!
on Jul 5, 2016
హీరోయిన్ అయిపోదామని వైజాగ్ నుండి తట్టాబుట్టా సర్దుకొని వచ్చేసి హీరోయిన్ ఆఫర్లు రాక ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసుకొంటూ.. అడపాదడపా హీరోయిన్ గా పేరు సైతం తెలియని సినిమాల్లో నటించి "కథానాయకి" అనిపించుకోవడానికి అన్నీ రకాల పాట్లూ పడిన రష్మీ ఆఖరికి ఎక్స్ పోజింగ్ కు కూడా నో చెప్పకుండా.. అందాలన్నీ ఆరబోస్తూ నటించినా అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు. దాంతో కొన్నాళ్లపాటు కనుమరుగైపోయింది.
కొన్నాళ్ళ గ్యాప్ అనంతరం "జబర్దస్త్" గేమ్ షో ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. బుల్లితెర-వెండితెర అన్న తేడాను పట్టించుకోకుండా సదరు షోలో సెన్సార్ వారికి పనిచెప్పనంతవరకూ ఎక్స్ ఫోజ్ చేసి తన ఉనికిని చాటుకోంది. దాంతో అమ్మడి పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. సినిమా ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి. ముఖ్యంగా.. మొన్న విడుదలైన "గుంటూర్ టాకీస్"లో రష్మీ అందాల ఆరబోత శృతి మించడమే కాదు.. శృతి తప్పింది కూడా. ఆ సినిమాలో రష్మీ అందాలు చూసి నోరెళ్ళబెట్టినవారిని ఏమాత్రం నిరాశపరచకుండా తాజా చిత్రం "అంతం"లోనూ అదే స్థాయిలో ఎక్స్ ఫోజ్ చేసింది అమ్మడు. జూలై 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా కూడా "గుంటూర్ టాకీస్" స్థాయిలో మోడరేట్ సక్సెస్ సాధిస్తుందో లేక ఎప్పూడూ అదే ఎక్స్ పోజింగా అని ప్రేక్షకులు సినిమాను పక్కనపెడతారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!