ఇంకా పెళ్లి గురించి అడుగుతారేంటి?
on Nov 19, 2019

టబు బ్రహ్మచారి. పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడామె వయసు 48 ఏళ్ళు. అయితే అంత వయసున్నట్టు టబు కనిపించరు. టబు అందం ఆమె వయసును కొంతవరకు దాచేస్తుందనేది నిజమనే చెప్పాలి. అడవి కాచిన వెన్నెల అన్నట్టు... ఈ అందం వెండితెర ముందున్న ప్రేక్షకుల సొంతమే. టబు ఇంకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి. ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదనే విషయాన్ని పక్కన పెడితే... "ఇంకా నా పెళ్లి గురించి అడుగుతారేంటి?" అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
"నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది... ప్రజలు ఇంకా నా పెళ్లి గురించి అడుగుతుంటే. అయితే, నాపై వాళ్ళందరూ ఎంతో ప్రేమచూపిస్తున్నారు. ఏం జరిగినా... అంతా మన మంచికే అనుకుంటాను. జీవితంలో నేను ప్రేమను కోల్పోయానో? లేదో? తెలియదు. కానీ, జీవితంలో ప్రేమ అనేది ఓ అందమైన విషయం" అని టబు పేర్కొన్నారు. కొంత విరామం తర్వాత తెలుగులో 'అల... వైకుంఠపురములో' సినిమా చేస్తున్నారామె. త్రివిక్రమ్ అందమైన పాత్ర రాశారని టబు చెప్పారు. సినిమాలో ఎక్కువ డైలాగులతో కాకుండా, కళ్ళతో హావభావాలను వ్యక్తం చేసే పాత్ర తనదని టబు అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



