వార్ 2 ,మహావతార్ నరసింహ, కూలీ కలెక్షన్స్ ల తేడా ఇదే!
on Aug 21, 2025
![]()
ఈ నెల 14 న వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద కూలీ(Coolie),వార్ 2(War 2)చిత్రాలు పోటాపోటీగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ మేరకు రెండు చిత్రాలు భారీగానే ఓపెనింగ్స్ ని రాబట్టడంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ తో థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం ఏర్పడింది. కానీ రెండు చిత్రాలు డివైడ్ టాక్ ని రాబట్టాయి. మరో వైపు జులై 25 న విడుదలైన 'మహావతార్ నరసింహ'(Mahavatar Narasimha)రోజు రోజుకి మౌత్ టాక్ తో రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తుండటంతో, ప్రేక్షకుల్లో ఈ మూడు చిత్రాల కలెక్షన్స్ పట్ల ఆసక్తి ఏర్పడింది.
వార్ 2 ఫస్ట్ వీక్ కి సంబంధించి తెలుగులో 59 .95 కోట్ల గ్రాస్, తమిళంలో కోటి 50 లక్షలు, మలయాళంలో కోటి 20 లక్షలు, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 71 .65 కోట్లు, ఓవర్సీస్ 69 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. దీంతో వరల్డ్ వైడ్ గా 297 .20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది.
కూలీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని చూసుకుంటే తమిళంలో 113.35 కోట్లు, తెలుగు 59.50 కోట్లు, కర్ణాటక 37.70 కోట్లు,కేరళ 22.95 కోట్లు, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 35 కోట్లు, ఓవర్సీస్ లో సుమారు 164 .80 కోట్లు రాబట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. టోటల్ గా 433 .80 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాల టాక్.
ఇక మహావతార్ నరసింహ అన్ని లాంగ్వేజెస్ లోను ఇప్పటి వరకు సుమారు 260 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. తెలుగులో 42 కోట్ల రూపాయిల కలెక్షన్స్ ని వసూలు చేసినట్టు గణాంకాలు చెప్తున్నాయి. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind)తెలుగులో రిలీజ్ చేసాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



