ఆహాలో వావ్ అనిపిస్తున్న 'వర్జిన్ స్టోరీ'
on May 7, 2023

'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని', 'రుద్రమదేవి', 'పటాస్', 'రేసుగుర్రం' చిత్రాల్లో బాల నటుడిగా మెప్పించిన విక్రమ్ లగడపాటి.. టీనేజ్ హీరోగా 'గోలిసోడా' చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో 'ఎవడూ తక్కువ కాదు' పేరుతో అనువాదమై అలరించింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'లో విక్రమ్ పోషించిన అన్వర్ పాత్ర నటుడిగా అతని ప్రతిభకు అద్దం పట్టింది. దిల్ రాజు నిర్మించిన 'రౌడీ బాయ్స్' చిత్రంలో రౌడీ కుర్రాళ్లలో ఒకడిగానూ నటించి మెప్పించాడు విక్రమ్.
తాజాగా విక్రమ్ నటించిన 'వర్జిన్ స్టోరీ' మూవీ అహాలో ప్రసారమవుతూ అసాధారణ స్పందన రాబడుతోంది. ప్రదీప్ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో విక్రమ్ సరసన సౌమిక నటించింది. యువతరం బ్రహ్మరథం పడుతున్న ఈ చిత్రాన్ని పెద్దలు సైతం బాగానే ఆస్వాదిస్తున్నారు. ఆహాలో 'వర్జిన్ స్టోరీ'కి వస్తున్న అద్భుత ఆదరణ గురించి విక్రమ్ మాట్లాడుతూ... ఇంత గ్రాండ్ రెస్పాన్స్ తాను అస్సలు ఊహించలేదని, ఈ క్రెడిట్ అంతా ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ చెందుతుందని అన్నాడు. తను హీరోగా నటించే తదుపరి చిత్రంతోపాటు, ఓ వెబ్ సిరీస్ కు సంబంధించిన వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని చెప్పిన విక్రమ్.. 'వర్జిన్ స్టోరీ'ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



