కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడు!
on Feb 26, 2023

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'వినరో భాగ్యము విష్ణుకథ'. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రం పరవాలేదు అనే టాక్ తెచ్చుకుంది. ఎనిమిది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా కిరణ్ కి మంచి విజయాన్ని అందించింది. మొదటి రెండు చిత్రాలు 'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కల్యాణమండపం'తో ఆకట్టుకున్న కిరణ్ ఆ తరువాత వరుసగా మూడు చిత్రాలతో నిరాశపరిచాడు. ఈ క్రమంలో 'వినరో భాగ్యము విష్ణుకథ' రూపంలో అతనికి మంచి విజయం వరించింది.
రూ.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'వినరో భాగ్యము విష్ణుకథ' ఎనిమిది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.4.25 కోట్ల షేర్ రాబట్టగా.. వరల్డ్ వైడ్ గా రూ.4.75 కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఫుల్ రన్ లో మరో కోటికి పైగా షేర్ సాధించి.. మొత్తానికి రూ.6 కోట్ల షేర్ వసూలు చేసే అవకాశముంది. ఈ చిత్రం భారీ విజయం సాధించే అవకాశం లేనప్పటికీ.. సరైన సమయంలో కిరణ్ కి మంచి విజయం దక్కిందని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



