విజయ్ 'లియో'పై తెలుగు నిర్మాత భారీ పెట్టుబడి
on Jul 23, 2023

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ `లియో`. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్నన చిత్రం కావటంతో సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే చాన్నాళ్లుగా తెలుగు సినిమా మార్కెట్‌ను పట్టించుకోని విజయ్ అండ్ టీమ్ ఈ మధ్య కాలంలో మాత్రం తెలుగు మార్కెట్‌పై పట్టు సాధించేలా అడుగులు వేస్తున్నారు. అదీ కాకుండా ఇప్పుడు మారుతున్న ట్రెండ్‌ను చూస్తే హీరోలతో, భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు అన్నీ సినిమాలు చూస్తున్నారు. దీంతో విజయ్‌కు మార్గం మరింత సులవైంది. ఆయన గత చిత్రం వారిసు (తెలుగులో వారసుడు)ని తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మిస్తే.. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు మంచి కలెక్షన్సే వచ్చాయి.
ఇప్పుడు అందరి దృష్టి లియో సినిమాపై పడింది. విజయ్ వంటి హీరోతో లోకేష్ కనకరాజ్ చేస్తోన్న సినిమా కావటంతో భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో లియో తెలుగు హక్కుల కోసం మన నిర్మాతలు గట్టిగానే పోటీ పడ్డారు. అయితే సమాచారం మేరకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా హక్కులను భారీ మొత్తాన్ని వెచ్చించి సొంతం చేసుకున్నారు. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు, లియో తెలుగు హక్కుల మేరకు ఏకంగా రూ.20 కోట్లు వెచ్చించారని టాక్ గట్టిగానే వినిపిస్తోంది. నిజంగానే విజయ్ సినిమా తెలుగు రైట్స్‌కు అంత మొత్తం ఖర్చు పెట్టటం అంటే రిస్క్ అనే చెప్పాలి. కానీ సూర్యదేవర నాగవంశీ రిస్క్ చేశారని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా లియో. అక్టోబర్ 19న రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాస్టర్ తర్వాత విజయ్, లోకేష్ కనకరాజ్ కలయికలో ఈ సినిమా రానుంది. మరి లోకేష్ క్రియేట్ చేస్తోన్న యూనివర్స్‌లో లియో సినిమా ఉంటుందా? ఉండదా అనేది తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



