నయనతారతో ప్రతిరోజూ ప్రేమికుల రోజే
on Feb 15, 2020
వెండితెరపై నయనతార చాలా ప్రేమకథల్లో నటించింది. అందుకే, రియల్ ప్రేమకథకు ఐదేళ్లు అని చెప్పింది. ఆఫ్ కోర్స్... రియల్ లైఫ్ లో కూడా నయనతారకు రెండు మూడు ప్రేమకథలు ఉన్నాయి. హీరో శింబు, దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారాలు పెళ్లి పీటల వరకూ వెళ్లి ఆగాయి. తర్వాత దర్శకుడు విఘ్నేష్ శివన్, ఆమె ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమకథకు, ప్రేమ ప్రయాణానికి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఐదేళ్ల క్రితం ప్రేమికుల రోజున నయనతారకు విఘ్నేష్ శివన్ ప్రపోజ్ చేశాడట. ఈ ఏడాది ప్రేమికుల రోజు ఉదయాన ప్రేయసి కథానాయికగా, సమంత మరో కథానాయికగా విఘ్నేష్ శివన్ ఒక సినిమా అనౌన్స్ చేశాడు. సాయంత్రం సోషల్ మీడియాలో మరో పెద్ద పోస్ట్ పెట్టాడు. "నా క్యూటీ (నయనతార) స్టోరీకి ఐదేళ్లు నిండాయి. ఐదేళ్ళలో నయనతారతో అంతులేని ప్రేమతో ఎన్నో అందమైన జ్ఞాపకాలు తలపుల వెనుకాల నిండి ఉన్నాయి. నువ్ చూపించే అన్ కండీషనల్ లవ్, అఫెక్షన్ తో ప్రతిరోజూ ప్రేమికుల రోజే" అని విఘ్నేష్ శివ పోస్ట్ చేశాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
