ఛావా క్లైమాక్స్ సీన్ పై విక్కీ కౌశల్ కీలక వ్యాఖ్యలు..మరి షూట్ ఎలా చేశారు!
on Dec 18, 2025
.webp)
-ఏం చెప్పాడు!
-క్లైమాక్స్ అప్పుడు ఏం జరిగింది
-షూట్ ఎలా చేసారు
మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, హిందువుల ఆరాధ్య దైవం 'ఛత్రపతి శివాజీ(chhatrapati shivaji)మహారాజ్' కొడుకు 'ఛత్రపతి శంభాజీ మహారాజ్'(chhatrapathi sambhaji Maharaj)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఛావా'(chhaava). ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి 5 న భారత దేశ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు తెలుగులోను డబ్ అయ్యి మంచి ఫలితాన్నే చవి చూసింది. ఇక ఈ మూవీ క్లైమాక్స్ లో శంభాజీ మహారాజ్ ని ఔరంగజేబు చిత్ర హింసలకి గురి చేసే సన్నివేశం ఎంతో మందిని కంటతడిపెట్టించింది. ఇనుప సువ్వలతో ఒళ్ళంతా రక్తం కారేలా చిత్ర హింసలకి గురి చేస్తున్నా, కళ్ళని పొడుస్తున్నా శంభాజీ మహారాజ్ తాను అనుకున్న లక్ష్య సాధన కోసం నిలబడతాడు. గూస్ బంప్స్ తెప్పించే స్థాయిలో పిక్చరైజేషన్ జరుపుకోవడంతో పాటు ఒరిజినల్ గానే సదరు సన్నివేశం జరుగుతుందన్నట్టుగా కూడా అనిపించింది.
రీసెంట్ గా చాలా రోజుల తర్వాత సదరు సన్నివేశం గురించి శంభాజీ మహారాజ్ క్యారెక్టర్ లో విజృంభించి నటించిన 'విక్కీ కౌశల్'(Vicky Kaushal)మాట్లాడుతు 'క్లైమాక్స్ సీక్వెన్స్ ని తెరకెక్కించడం అనుకున్నంత సులంభం కాదు. సన్నివేశం ప్రారంభించిన మూడవ రోజు చిత్రీకరణ టైంలోనే నేను గాయపడ్డాను. దాంతో నెలన్నర రోజులు షూటింగ్ ని ఆపేశాం. సెట్ ని తీసేసి మళ్ళీ రెండు నెలల తర్వాత సెట్ ని ఏర్పాటు చేసారు. అందుకు మరో పన్నెండు రోజుల సమయం పట్టింది..శంభాజీ మహారాజ్ గురించి ప్రపంచానికి చెప్పాలని నాతో సహా ప్రతి ఒక్కరం వంద శాతం కష్టపడ్డారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు అభిమానులతో పాటు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి.
Aslo read: శివాజీ పశ్చాత్తాపడుతున్నాడా! పూర్తి క్లారిటీ వచ్చేసింది
చావా కలెక్షన్స్ విషయానికి వస్తే సుమారు 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి 800 కోట్లు దాకా రాబట్టింది. రష్మిక(Rashmika Mandanna),అక్షయ్ ఖన్నా(Akshay Khanna)కూడా తమ తమ క్యారెక్టర్స్ లో అత్యద్భుతంగా నటించి విజయంలో బాగస్వామ్యులయ్యారు.ఇక విక్కీ కౌశల్ ప్రస్తుతం 'లవ్ అండ్ వార్' అనే మూవీలో చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ సదరు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



