నల్లబాలుకి టికెట్టు కావాలంట !
on Mar 20, 2014

రాజకీయ ఎన్నికల పోరు మొదలైన క్షణం నుండి టాలీవుడ్ నటులలో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో చేరిపోతున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా పెట్టేశాడు. అయితే తాజాగా ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని ఆయన నివాసంలో వేణుమాధవ్ కలిసారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీతో తనకు గత 20ఏళ్లుగా మంచి సంబంధం ఉందని, అందువల్లనే వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వమని అభ్యర్థించాను. ఆంధ్రప్రదేశ్ లో తాను ఎక్కడినుంచైనా పోటీ చేయగలనని, తనకు అన్ని ప్రాంతాల్లో కూడా అభిమానులున్నారు. తాను ఎక్కడి నుండి పోటీ చేస్తానో అనే అంశంపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు అని అన్నారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి స్పందిస్తూ... జనసేన ఆశయాలు తనకు ఎంతగానో నచ్చాయి. జనసేన పార్టీ టిడిపికి మద్దతివ్వాలని కోరుకుంటున్నాను. ఈ రెండు పార్టీల లక్ష్యం, విధానాలు ఒకటే కాబట్టి రెండు పార్టీలు కలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



