కేరళలో వెంకీ దృశ్యం
on Mar 18, 2014

మలయాళంలో మోహన్ లాల్ నటించిన "దృశ్యం" సినిమా సూపర్ హిట్టయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ లో వెంకటేష్ ,మీనా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా "దృశ్యం" అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళలోని చుట్టుపక్కల పరిసరాల్లో జరుగుతుంది. శ్రీ ప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ ప్రై.లిమిటెడ్ మరియు ఏంజిల్ క్రియేషన్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నదియా ఓ ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



