`ఎఫ్ 3`కి వెంకీ మూడు రెట్ల పారితోషికం!?
on May 20, 2022
సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది `ఎఫ్ 2` చిత్రం. 2019 సంక్రాంతికి విడుదలై సంచలనం సృష్టించిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్.. అప్పట్లో భారీ లాభాలు మూటగట్టుకుంది. కట్ చేస్తే.. ఇప్పడు `ఎఫ్ 2` ఫ్రాంచైజీలో రెండో సినిమాగా `ఎఫ్ 3` రాబోతోంది. ఇందులోనూ ఓ హీరోగా నటించారు వెంకటేశ్. వేసవి కానుకగా ఈ నెల 27న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
ఇదిలా ఉంటే, `ఎఫ్ 3`కి వెంకీ భారీ పారితోషికమే అందుకున్నారని సమాచారం. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం.. `ఎఫ్ 2`కి రూ. 5 కోట్ల పారితోషికం తీసుకున్న వెంకటేశ్.. అందుకు మూడు రెట్ల రెమ్యూనరేషన్ అంటే రూ. 15 కోట్ల పారితోషికం `ఎఫ్ 3` కోసం అందుకున్నారట. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది.
కాగా, `ఎఫ్ 3`లో వెంకీతో పాటు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మరో హీరోగా నటించగా.. తమన్నా, మెహ్రీన్, సునీల్, సోనాల్ చౌహాన్, రాజేంద్ర ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో ఎంటర్టైన్ చేయనున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రాన్ని `దిల్` రాజు నిర్మించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బాణీలు అందించారు.