వెంకీ, రవితేజల మల్టీస్టారర్
on Oct 14, 2014
.jpg)
టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమా అనగానే అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చే హీరో విక్టరీ వెంకటేష్. ఎలాంటి బేషజాలు లేకుండా స్టొరీ బాగుంటే చిన్న హీరోతో కూడా కలిసి నటించడానికి రెడీగా వుంటారు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మల్టీస్టారర్ సినిమాలు వుంటాయా అని అందరూ అనుకుంటున్న సమయంలో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”తో మహేష్ తో కలిసి మల్టీ స్టారర్ చిత్రాల పద్దతిని పునఃప్రారంభించాడు వెంకటేష్. తరువాత వెంటనే రామ్ తో నవ్వుల “మసాలా” అందించాడు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ తో కలిసి 'గోపాల గోపాల' అంటూ అభిమానులను అలరించడానికి సిద్దమవబోతున్నాడు. లేటెస్ట్ గా మాస్ మహారాజా రవితేజతో కలిసి మరో మల్టీస్టారర్‌కి సిద్ధమవుతున్నాడు వెంకటేష్. వీరు పోట్ల డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈమూవీ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా సంక్రాంతి తరువాత సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



