శ్రీదేవి సాంగ్ తో 'వాల్మీకి'
on Aug 31, 2019
"ఎల్లువొచ్చి గోదారమ్మ... ఎల్లకిల్లా పడ్డాదమ్మో" ఈ సాంగ్ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. దేవత సినిమాలో శ్రీదేవి, శోభన్ బాబు పై ఈ సాంగ్ చిత్రీకరించారు దర్శకేంద్రుడు. అయితే ఈ పాట గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావన వచ్చిందనే కదా... మీ సందేహం. అక్కడికే వస్తున్నా.. ఈ పాటను వరుణ్ తేజ్ నటిస్తోన్న 'వాల్మీకి' సినిమా లో రీమిక్స్ చేస్తున్నారని సమాచారం. ప్రెసెంట్ ఈ సాంగ్ రాజమండ్రిలో షూటింగ్ జరుగుతోందట. వేటూరి రాసిన ఈ పాటను చక్రవర్తి స్వరపరిచారు. ఇక తమిళం లో 'జిగర్తాండ' సినిమాకు తెలుగు రీమేక్ గా 'వాల్మీకి' రూపొందుతోంన్న సంగతి తెలుస్తోంది. సెప్టెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.