వరుణ్‌తేజ్@లాస్ ఏంజిల్స్!
on Feb 7, 2019
వరుణ్‌తేజ్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్నారిప్పుడు! అక్కడేం చేస్తున్నారు? అంటే... బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నారు! ఎందుకు? అంటే... కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, బాక్సింగ్ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్న ఓ చిత్రంలో వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించనున్న సంగతి తెలిసిందే. అందులో ఆయనది బాక్సర్ క్యారెక్టర్. దాని కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లి ఓ ఫ్రొఫెషనల్ కోచ్ దగ్గర బాక్సింగ్‌లో మెళకువలు తెలుసుకుంటున్నారు. వరుణ్‌తేజ్ ఓ కథానాయకుడిగా నటించిన ‘ఎఫ్ 2’ సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది. ఇటీవల, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు.