మెగా హీరో వస్తున్నాడు.. ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు!
on Jan 17, 2023

విభిన్న చిత్రాలతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్ తేజ్.. గతేడాది 'గని' చిత్రంతో నిరాశపరిచాడు. వెంకటేష్ తో కలిసి చేసిన మల్టీస్టారర్ 'ఎఫ్-3'తో మాత్రం పర్లేదు అనిపించుకున్నాడు. ఇక ఈ ఏడాది సోలో హీరోగా హిట్ కొట్టి సత్తా చాటాలి అనుకుంటున్నాడు.
'చందమామ కథలు', 'పిఎస్‌వి గరుడ వేగ' వంటి సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ తన 12వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని గురువారం(జనవరి 19న) రివీల్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ప్రీలుక్ పోస్టర్ ను వదిలారు. అందులో సూట్ ధరించి చేతిలో గన్ పట్టుకొని ఉన్న వరుణ్ తేజ్ లుక్ స్టైలిష్ గా హాలీవుడ్ తరహాలో ఉంది. పోస్టర్ చూస్తుంటే వరుణ్-ప్రవీణ్ కలిసి ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు అనిపిస్తోంది. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



