ఆకట్టుకుంటున్న 'ఉస్తాద్' టీజర్!
on Apr 12, 2023

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి 'మత్తు వదలరా' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే ఆకట్టుకొని హిట్ కొట్టిన ఈ కుర్ర హీరో.. ఆ తర్వాత 'తెల్లవారితే గురువారం', 'దొంగలున్నారు జాగ్రత్త' సినిమాలతో నిరాశపరిచాడు. అయితే ఇప్పుడు తన తాజా చిత్రం 'ఉస్తాద్'తో మాత్రం హిట్ కొట్టేలా ఉన్నాడు.
శ్రీ సింహా, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా ఫణిదీప్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్'. వారాహి చలన చిత్రం నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ తాజాగా రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదలైంది. ఎత్తు నుంచి కిందకు చూడలేని వ్యక్తి.. ఏకంగా పైలట్ అయ్యి విమానం నడిపే స్థాయికి ఎలా ఎదిగాడనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. ఎమోషనల్ సన్నివేశాలు, బ్యూటిఫుల్ మ్యూజిక్ తో టీజర్ ఆసక్తికరంగా సాగింది.
అకీవా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పవన్ కుమార్ పప్పుల, ఎడిటర్ గా కార్తీక వ్యవహరిస్తున్నారు. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



