పుష్ప-3 లో బాలయ్య.. ఆ విషయంలోనే అల్లు అర్జున్ కి కోపం...
on Nov 10, 2024

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ గా ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోకి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇటీవల నాలుగో సీజన్ ప్రారంభమైంది. నాలుగో సీజన్ నుంచి ఇప్పటికే మూడు ఎపిసోడ్ లు విడుదలై సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు నాలుగో ఎపిసోడ్ కి ముహూర్తం ఫిక్స్ అయింది. (Unstoppable Season 4)
అన్ స్టాపబుల్ సీజన్-4 నాలుగో ఎపిసోడ్ లో అల్లు అర్జున్ (Allu Arjun) సందడి చేశాడు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఐదు నిమిషాల ఈ ప్రోమోలో బాలయ్య, బన్నీ కలిసి అదిరిపోయే వినోదాన్ని పంచారు. "మనమిద్దరం రిలేటివ్స్ అవుతాం.. నేను కృష్ణుడిని, నువ్వు అర్జునుడివి" అంటూ తమ పేర్లతో బాలయ్య ఫన్ చేయడం బాగుంది. "మన తెలుగు హీరోలకు నేషనల్ అవార్డు రాలేదని నా మనసులో ఉండిపోయింది. ఎప్పటికైనా సాధించాలి అనుకున్నాను." అంటూ తనకు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వచ్చిన విషయాన్ని పంచుకున్నాడు అల్లు అర్జున్. మావయ్య చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని కూడా షేర్ చేసుకున్నాడు. అలాగే అమ్మాయిల విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే తనకు చాలా కోపం వస్తుందని బన్నీ చెప్పాడు. ఇక చివరిలో "మీరు పుష్ప-3 చేయండి.. నేను అఖండ-3 చేస్తాను" అని బాలయ్యతో బన్నీ చెప్పడం సరదాగా ఉంది. ఈ ఎపిసోడ్ నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



