యుకె పార్లమెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి హవా..ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా రికార్డు
on Mar 14, 2025
.webp)
సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తు వస్తున్న మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)భారత ప్రభుత్వం(Indian Government)నుంచి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ తో పాటు,అత్యంత సమర్ధవంతమైన నటుడు, డ్యాన్సర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తో సత్కరించబడ్డ విషయం తెలిసిందే.ప్రతిష్టాత్మక ఎ.ఎన్.ఆర్(Anr)జాతీయ అవార్డుని కూడా అందుకున్నాడు.
ఇప్పుడు హౌస్ ఆఫ్ కామన్స్ ,యు కె పార్లమెంట్(Uk parliament)లో గౌరవ సత్కారం జరగనున్నది.యు కె పార్లమెంట్ లో చిరంజీవిని అధికార లేబర్ పార్టీ(Labour Party) పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా(Navendu Mishra)మార్చి 19న సన్మానించనున్నారు.సోజన్ జోసెఫ్,బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.ఇదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా(Bridge India)సంస్థ, సినిమా మరియు ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం'ప్రదానం చేయనున్నారు.బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డుని తొలిసారిగా అందజేస్తోంది. దాన్ని చిరంజీవి అందుకోనుండటం విశేషం.ఈ అవార్డు చిరు కీర్తి కీరటంలో కలికితురాయిగా నిలిచిపోతుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యు.కె లో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు,తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉదేశ్యంతో వారిని సత్కరిస్తుతుంది.ఈ విధంగా యు.కె కు చెందిన పార్లమెంట్ సభ్యులు, బ్రిడ్జ్ ఇండియా అంతర్జాతీయ వేదికపై చిరంజీవిని సన్మానించటం, ఆయనకు లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డ్ ఇస్తుండటంతో సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



