మెగాస్టార్ 'ఇంద్ర'సేనారెడ్డిగా అలరించి 20 ఏళ్ళు
on Jul 24, 2022

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో సంచలన విజయాలను అందుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో 'ఇంద్ర' ఒకటి. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 24, 2002 విడుదలై అప్పటిదాకా ఉన్న రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ విడుదలై నేటితో 20 ఏళ్ళు పూర్తయింది.
'స్టేట్ రౌడీ', 'మెకానిక్ అల్లుడు' తర్వాత చిరంజీవితో బి.గోపాల్ చేసిన సినిమా 'ఇంద్ర'. నటసింహం బాలకృష్ణతో చేసిన 'సమరసింహా రెడ్డి', 'నరసింహ నాయుడు' చిత్రాలతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన గోపాల్.. 'ఇంద్ర'తో తన సినిమాల రికార్డులు తనే బ్రేక్ చేసి మరో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. 'ఇంద్ర'లో మెగాస్టార్ పవర్ ఫుల్ డైలాగ్స్ కి, డ్యాన్స్ లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. "మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా" అనే డైలాగ్ అయితే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఇక 'దాయి దాయి దామ్మా' సాంగ్ లో చిరు వేసిన స్టెప్పులకి అప్పట్లో థియేటర్స్ మారుమోగిపోయాయి. కామెడీ, యాక్షన్, ఎమోషన్ కలగలిసి పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్స్ కి క్యూ కట్టేలా చేసి కలెక్షన్ల సునామీ సృష్టించింది. రెండు దశాబ్దాలైనా ఇప్పటికీ ఈ సినిమాకి బుల్లితెరపై ఆదరణ ఏమాత్రం తగ్గలేదు.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమాలో సోనాలి బెంద్రే, ఆర్తీ అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతమే అందించాడు. ఆయన కంపోజ్ చేసిన ఆరు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



