పవన్ మూవీలో సల్మాన్.. హరీష్ శంకర్ ట్విస్ట్ ఇచ్చాడు
on Jun 10, 2022

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'గబ్బర్ సింగ్'(2012) ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇక వీరి కాంబోలో రానున్న రెండో సినిమా 'భవదీయుడు భగత్ సింగ్'ను కొద్ది నెలల క్రితం ప్రకటించారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించనున్నాడని రీసెంట్ గా వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదంటూ హరీష్ ట్విస్ట్ ఇచ్చాడు.
ఎప్పుడో ప్రకటించిన 'భవదీయుడు భగత్ సింగ్' ఇంతవరకు పట్టాలు ఎక్కకపోవడంతో అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అని కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని ఇటీవల మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలయ్యారు. దానికితోడు వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఇందులో సల్మాన్ కూడా నటించనున్నాడంటూ ప్రచారం మొదలైంది. ముంబై వెళ్లిన హరీష్.. సల్మాన్ ని కలిసి స్క్రిప్ట్ చెప్పాడని, రోల్ నచ్చడంతో సల్మాన్ ఓకే చెప్పాడని వార్తలొచ్చాయి. ఇప్పటికే చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ నటిస్తుండటంతో.. ఈ వార్త నిజమేనని భావించారంతా.
అయితే ఈ వార్తలో నిజం లేదని తాజాగా హరీష్ క్లారిటీ ఇచ్చాడు. తాను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని, ఇలాంటి వార్తలు రాసేముందు ఒక మాట నన్ను అడిగితే బాగుటుందని ఆయన ట్వీట్ చేశాడు. హరీష్ ట్వీట్ తో 'భవదీయుడు భగత్ సింగ్'లో సల్మాన్ నటించట్లేదని తేలిపోయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



