సక్సెస్‌ఫుల్ హీరో టొవినోతో త్రిష!
on Jul 4, 2023

మలయాళంలో ఇప్పుడు సూపర్‌సక్సెస్‌ఫుల్ హీరో టొవినో థామస్. ఆయన పక్కన నటించడానికి త్రిష కృష్ణన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మాలీవుడ్‌లో ఇప్పుడు ఇది బిగ్ న్యూస్. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ దర్శకత్వం వహిస్తారు. త్రిష మలయాళంలో నివిన్ పాలీ సినిమా హే జ్యూడ్‌తో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మోహన్‌లాల్ సరసన థ్రిల్లర్ రామ్‌లో నటిస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధమవుతున్నప్పుడే టొవినో మూవీ ఆఫర్ తలుపు తట్టింది. టొవినో, త్రిష ఇప్పటికే పలు అవార్డుల వేడుకల్లో కలుసుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానాన్ని గుర్తుచేసుకుని మురిసిపోతున్నారు ఫ్యాన్స్. వీరిద్దరూ కలిసి నటిస్తే చూద్దామనుకున్నవారి కల నెరవేరుతోంది. ఆన్‌స్క్రీన్ మీద వారిద్దరి కెమిస్ట్రీ చూడటానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు.
విన్నైతాండి వరువాయా సినిమా సీక్వెల్ లో హీరోగా టొవినో థామస్‌నే అనుకున్నారట డైరక్టర్ గౌతమ్ వాసుదేవమీనన్. కానీ, ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు. అప్పుడు మిస్ అయిన కాంబినేషన్ ఇప్పుడు కుదురుతున్నందుకు హ్యాపీగా ఉన్నారు టొవినో, త్రిష అభిమానులు. ఆల్రెడీ 2018 సక్సెస్‌తో ఉన్నారు టొవినో. పొన్నియిన్ సెల్వన్ రెండు పార్టులూ కుందవైగా త్రిషకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది అక్టోబర్ 19న విడుదల కానున్న లియోలో త్రిష హీరోయిన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



