నేను పాత త్రిప్తిని కాదు.. ఆ మూవీ తన జీవితాన్నే మార్చేసిందా!
on Jul 28, 2025

రణబీర్ కపూర్(Ranbir Kapoor),రష్మిక(Rashmika Mandanna)జంటగా సందీప్ రెడ్డి వంగ(SundeepReddy Vanga)దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్'(Animal)మూవీ సాధించిన ఘన విజయం అందరకి తెలిసిందే. ఈ చిత్రంలో పాత్ర నిడివి తక్కువ అయినా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ని ప్రదర్శించి, ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన నటి 'త్రిప్తి డిమ్రి'(Tripti Dimri). గత ఏడాది నవంబర్ లో 'భూల్ భూలయ్య పార్ట్ 3 'తో అలరించిన త్రిప్తి, అగస్ట్ 1 న 'దఢక్ పార్ట్ 2'(Dhadak 2)తో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ డెబ్యూ మూవీ 'దఢక్' కి సీక్వెల్ గా 'దఢక్ 2 తెరకెక్కడంతో 'త్రిప్తి రోల్ పై అందరిలోను ఆసక్తి నెలకొని ఉంది.
ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో త్రిప్తి మాట్లాడుతు 'దఢక్ పార్ట్ 2 'లో నేను 'విధి' అనే క్యారక్టర్ ని పోషించాను. 'విధి' ధైర్యవంతురాలు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నిజం చెప్పడానికి భయపడదు. నిజ జీవితంలో నేను ఎన్నో విషయాల పట్ల మౌనంగా ఉన్నాను. వాటికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు. అది తప్పు అని చెప్పే దైర్యం కూడా నాకు ఉండేది కాదు. ఈ సినిమాతో నేను 'విధి'లా బతకాలని నిర్ణయించుకున్నాను. ఈ మూవీ ఒప్పుకుంది కూడా అందుకే. అనుకున్న విధంగానే ఈ సినిమా ముగిసే సమయానికి ఎవరికీ భయపడకుండా దైర్యంగా మాట్లాడేలా చేసింది. నా కెరీర్ కి అవసరమైన ఎన్నో కొత్త విషయాలని కూడా దఢక్ 2 నేర్పిందని త్రిప్తి చెప్పుకొచ్చింది.
2017 లో 'శ్రీదేవి'(Sridevi)టైటిల్ రోల్ లో వచ్చిన 'మామ్'(Mom)అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన త్రిప్తి, 2018 లో వచ్చిన లైలా మజ్నుతో సోలో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత 'బుల్ బుల్', 'ఖలా', 'బాడ్ న్యూజ్', 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' వంటి చిత్రాలతో అలరించింది. 'దఢక్ 2 'ని ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్(Karan JOhar)నిర్మించగా షాజియా ఇక్బాల్(Shazia Iqbal)దర్శకత్వం వహించింది. సిద్దాంత్ చతుర్వేది(Siddhant Chaturvedi)హీరో.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



