నెట్ ఫ్లిక్స్ లో టొవినో థామస్ కొత్త చిత్రం!
on Oct 28, 2021
వైవిద్యానికి పెద్దపీట వేసే మలయాళ కథానాయకుల్లో టొవినో థామస్ ఒకరు. ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అయిన `ఫోరెన్సిక్`, `మాయానది`, `వ్యూహం`, `లూకా` వంటి అనువాదాలతో తెలుగువారికి కూడా చేరువయ్యాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. త్వరలో టొవినో థామస్.. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో తన కొత్త చిత్రంతో పలకరించబోతున్నాడు. ఆ సినిమానే.. `మిన్నల్ మురళి`. సూపర్ హీరో అడ్వెంచర్ కామెడీగా రూపొందిన ఈ చిత్రంలో గ్లోబల్ పవర్స్ ఉన్న లోకల్ సూపర్ హీరోగా ఎంటర్టైన్ చేయనున్నాడు టొవినో.
2020 చివరలోనే థియేట్రికల్ రిలీజ్ గా సందడి చేయాల్సిన ఈ మూవీ.. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఫైనల్ గా.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అయింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24 నుంచి స్ట్రీమ్ కానున్న `మిన్నల్ మురళి`.. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఒకే టైటిల్ తో అనువాద రూపంలో అందుబాటులో ఉండనుంది. బసిల్ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సోఫియా పాల్ నిర్మించారు. మరి.. టొవినో గత చిత్రం `కాణేక్కాణే` సోనీ లివ్ లో నేరుగా స్ట్రీమ్ అయి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్న నేపథ్యంలో.. 158 నిమిషాల `మిన్నల్ మురళి` కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.