దర్శకుడితో సహజీవనం చేస్తున్న స్టార్ కథానాయిక?
on Jun 15, 2015

లివింగ్ టుగెదర్ రిలేషన్ షిప్ టాలీవుడ్‌కీ పాకింది. ఓ స్టార్ దర్శకుడితో ఓ స్టార్ కథానాయిక సహజీవనం చేస్తుందన్నది లేటెస్ట్ టాలీవుడ్ గాసిప్. ఆ దర్శకుడికి ఇండ్రస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన స్టామినా ఉంది. ఆ హీరోయిన్‌కి టాప్ హీరోలతో చిందులు వేసిన ఘనత ఉంది. వీరిద్దరూ కలసి గతంలో ఓ సినిమా చేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య చనువు పెరిగి దగ్గరయ్యారట.
హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ఇద్దరూ మకాం పెట్టేశారని తెలుస్తోంది. షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ దర్శకుడికి ఆల్రెడీ పెళ్లయి పిల్లలూ ఉన్నారు. ఈ హీరోయినేమో ఓసారి లవ్‌లో పడి ఫెయిల్ అయ్యింది. వీరిద్దరి ఎఫైర్ గురించి టాలీవుడ్ అంతా తెలిసిపోయింది. త్వరలో ఆ దర్శకుడు తెరకెక్కించే సినిమాలో ఈమెనే కథానాయిక అని తెలుస్తోంది. ఎఫైర్లు నడపడం ఆ దర్శకుడికేం కొత్తకాదు. ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేశాడట. ఈ ఎఫైర్ ముచ్చటగా మూడోది. మరి ఆ దర్శకుడెవరు, ఆ స్టార్ నాయిక ఎవరనే విషయాలపై ఫిల్మ్‌నగర్‌లో ఆసక్తి నెలకొంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



