ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు టాలీవుడ్ టాప్ స్టార్స్!
on May 19, 2023

సినీ ప్రముఖులు అందరూ ఒకే వేదిక మీద సందడి చేయనున్నారు. దీనికి నందమూరి తారక రాముని శత జయంతి ఉత్సవం వేదిక కానుంది. ఏడాదిగా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటీవల విజయవాడలో జరిగిన వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. అయితే రేపు(మే 20) హైదరాబాద్ లో జరగనున్న వేడుకకు యావత్తు సినీ పరిశ్రమనే కదలిరానుంది.
హైదరాబాద్ కె.పి.హెచ్.బి లోని ఖైతలాపూర్ గ్రౌండ్స్ లో శనివారం సాయంత్రం ఎన్టీఆర్ శత జయంతి వేడుక వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు నందమూరి కుటుంబంతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తరలిరానున్నారు. చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, పవన్ కళ్యాణ్, శివరాజ్ కుమార్, వెంకటేష్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, జయప్రద, షావుకారు జానకి తో పాటు సినీ రాజకీయ రంగాలకు ఎందరో ప్రముఖులు అతిథులుగా హాజరవుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ కి చెందిన ఎందరో స్టార్లు ఒకే వేదికపైన సందడి చేయనుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



