2021 స్వరప్రస్థానం..`మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్` తమన్!
on Dec 30, 2021

ప్రతీ ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా తమ బాణీలతో అలరించే ప్రయత్నం చేశారు సీనియర్ అండ్ యంగ్ మ్యూజిక్ కంపోజర్స్. ఈ క్యాలెండర్ ఇయర్ లో స్వరకర్తల ప్రస్థానం ఏ రీతిన సాగిందంటే..
ఇళయరాజాః- మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఈ ఏడాది తెలుగునాట `గమనం`తో పలకరించారు. తన శైలి బాణీలతో ఆకట్టుకున్నారు.
కీరవాణిః- స్వరవాణి కీరవాణి ఈ క్యాలెండర్ ఇయర్ లో `కొండ పొలం`, `పెళ్ళి సందడి` చిత్రాలతో పలకరించారు. తన మార్క్ పాటలతో ఎంటర్టైన్ చేశారు. వీటిలో `పెళ్ళి సందడి` చెప్పుకోదగ్గ ఫలితం చూసింది.
మణిశర్మః- మెలోడీబ్రహ్మ మణిశర్మ ఈ ఏడాది `రెడ్`, `నారప్ప`, `సీటీమార్`, `శ్రీదేవి సోడా సెంటర్`, `రిపబ్లిక్`, `ఆరడుగుల బుల్లెట్` సినిమాలతో సందడి చేశారు. వీటిలో `రెడ్`, `నారప్ప`, `సీటీమార్` ప్రజాదరణ పొందాయి.
దేవి శ్రీ ప్రసాద్ః- రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ క్యాలెండర్ ఇయర్ లో `అల్లుడు అదుర్స్`, `ఉప్పెన`, `రంగ్ దే`, `పుష్ప - ద రైజ్` వంటి తెలుగు చిత్రాలతో సందడి చేశారు. వీటిలో `ఉప్పెన`, `పుష్ప - ద రైజ్` మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
తమన్ః- తెలుగునాట ఈ ఏడాది యువ సంగీత సంచలనం తమన్ హవా బాగా సాగింది. `క్రాక్`, `వకీల్ సాబ్`, `వైల్డ్ డాగ్` (నేపథ్య సంగీతం), `టక్ జగదీశ్` (పాటలు), `వరుడు కావలెను` (రెండు పాటలు), `అఖండ` వంటి చిత్రాలతో పలకరించాడు తమన్. వీటిలో `క్రాక్`, `వకీల్ సాబ్`, `అఖండ` చిత్రాల్లో పాటలు, నేపథ్య సంగీతం తమన్ కి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. `మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్`గా నిలిపాయి.
మిక్కీ జే మేయర్ః- ఈ సంవత్సరం `శ్రీకారం`, `శ్యామ్ సింగ రాయ్` సినిమాలతో ఎంటర్టైన్ చేశాడు మిక్కీ జే మేయర్. వీటిలో `శ్యామ్ సింగ రాయ్` సక్సెస్ రూట్ లో వెళుతోంది.
రథన్ః- ఈ ఏడాది `జాతి రత్నాలు`, `పాగల్`, `అద్బుతం` చిత్రాల్లో తన స్వరాలతో ఆకట్టుకున్నాడు రథన్. మరీముఖ్యంగా.. `జాతిరత్నాలు`లోని ``చిట్టి`` పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది.
అనూప్ రూబెన్స్ః- ఈ క్యాలెండర్ ఇయర్ లో `30 రోజుల్లో ప్రేమించటం ఎలా?`, `మంచి రోజులు వచ్చాయి`, `దృశ్యం 2` సినిమాలతో పలకరించాడు అనూప్ రూబెన్స్. వీటిలో `30 రోజుల్లో..`, `దృశ్యం 2` పేరు తీసుకువచ్చాయి.
ఛైతన్ భరద్వాజ్ః- `ఆర్ ఎక్స్ 100`తో పాపులర్ అయిన ఛైతన్ భరద్వాజ్.. ఈ ఏడాది `ఎస్ ఆర్ కళ్యాణమండపం`, `మహాసముద్రం` చిత్రాలతో అలరించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



