దసరా బరిలో టైగర్.. బాలయ్య, బోయపాటితో వార్!
on Mar 29, 2023
మాస్ మహారాజా రవితేజ త్వరలో 'రావణాసుర' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇది విడుదలైన కొన్ని నెలలకే మరో చిత్రంతో అలరించనున్నాడు రవితేజ. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమాకు వంశీ దర్శకుడు. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్.
'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాన్ని దసరా కానుకగా 2023, అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పటికే దసరా బరిలో రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం నిలిచింది. ఈ సినిమాని అక్టోబర్ 20 న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల అనౌన్స్ చేశారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలయికలో రానున్న 'NBK 108'(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని సైతం దసరాకే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే జరిగితే ఈ ఏడాది దసరాకు త్రిముఖ పోరు తప్పదు. మరి ఈ పోరులో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
