ట్రైలర్ రివ్యూ: తొలిప్రేమ
on Feb 2, 2018
ఫిదా లాంటి కూల్ హిట్ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ ఎలాంటి సినిమా చేస్తాడోనని సినీజనాలతో పాటు ప్రేక్షకులు ఎంతో ఎగ్జయిటింగ్‌తో ఎదురుచూశారు. మాస్ ఎంటర్టైనర్ల కంటే ప్రేమకథలే తనకు బాగా సూట్ అవుతున్నాయని గ్రహించిన వరుణ్ తేజ్.. ఈ ప్లాన్‌లో భాగంగా వెంకీ అట్లూరి అనే కొత్తకుర్రాడితో చేసిన సినిమానే తొలిప్రేమ. బాబాయ్ పవన్‌కి మాస్లో మంచి బేస్‌ను ఇచ్చిన తొలిప్రేమ టైటిల్‌ను మెగాప్రిన్స్ ఎంచుకోవడంతో.. సినిమా ఎలా ఉండబోతోందోనని మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఇవాళ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా మనతోనే ఉంటాయి..మోయక తప్పదు అంటూ వరుణ్ చెప్పే డైలాగ్‌తో మొదలయ్యే ట్రైలర్ చివరగా రాశిఖన్నా చెప్పే డైలాగ్‌తో ముగిసింది. గత చిత్రాల కంటే వరుణ్ తేజ్ నటుడిగా ఎంతో మెచ్యూరిటిని చూపించాడు. స్టూడెంట్‌గా ఎనర్జీని.. ప్రేమను పొందటానికి నలిగిపోయే వ్యక్తిగా రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. ఇక హీరోయిన్ రాశిఖన్నా కెరీర్లోనే నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసినట్లు కనిపిస్తోంది. సినిమా మొత్తం ఫ్రేమ్ టూ ఫ్రేమ్ ఆమె తప్ప మరెవరూ కనిపించలేదు. ప్రియదర్శి కామెడీతో కితకితలు పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. సినిమాటోగ్రఫీకి తగ్గట్టుగా థమన్ ట్యూన్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్‌పై భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.