తమన్ కి 2021ని సూపర్ స్పెషల్ చేసిన ముగ్గురు స్టార్స్!
on Dec 3, 2021
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్, హిట్స్ ఉన్నాయి. అయితే ఒకే ఏడాదిలో స్టార్ హీరోలతో చేసిన అన్ని సినిమాలు కూడా విజయం అందుకోవడం తన విషయంలో అరుదనే చెప్పాలి. అలా.. 2021 తమన్ కి సూపర్ స్పెషల్ గా నిలుస్తోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. 2021 సంక్రాంతి కానుకగా విడుదలైన `క్రాక్`తో ఈ ఏడాది ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు తమన్. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ సినిమాకి తమన్ పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి. ఇక ఇదే ఏడాది ఏప్రిల్ లో ఉగాది కానుకగా రిలీజైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం `వకీల్ సాబ్` కూడా మంచి కలెక్షన్స్ చూసింది. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ లేకపోతే మరింతగా బాక్సాఫీస్ ముంగిట ప్రభావం చూపించేదీ సినిమా. అలాగే రీసెంట్ గా జనం ముందుకు వచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా `అఖండ` కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. మొత్తమ్మీద బాలయ్య, పవన్, రవితేజ.. ఇలా ఈ సంవత్సరం టాప్ హీరోలతో తమన్ చేసిన సినిమాలన్నీ కూడా విజయం సాధించడం విశేషమనే చెప్పాలి. అలా.. 2021 తమన్ కి సూపర్ స్పెషల్ ఇయర్ గా నిలిచిపోయినట్టే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
