ప్రముఖ నటుడి హత్య! జలపాతం వద్ద ఉన్న బాడీపై గాయాలు
on Apr 29, 2025
ఇండియా వ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్ లలో' ది ఫ్యామిలీమాన్'(The Family Man)సిరీస్ కూడా ఒకటి. ఇప్పటి వరకు రెండు భాగాలు రిలీజ్ కాగా, మూడో భాగం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సమంత(Samantha)ప్రియమణి, మనోజ్ బాజ్ పేయి, షరీబ్ హష్మీ, ఆశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ అండ్ డికే ద్వయం దర్శకత్వం వహించింది.
రీసెంట్ గా మూడో పార్ట్ లో నటించిన 'రోహిత్ బస్ఫోర్'(Rohit Basfore)అనే నటుడు 'అస్సోమ్'(Assam)లోని ఒక జలపాతం వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి రోహిత్ విహార యాత్రకి వెళ్ళాడు.ఆ తర్వాత కుటుంబ సభ్యులు రోహిత్ కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి అస్సోమ్ లోని జలపాతం వద్ద రోహిత్ మృతదేహాన్ని గుర్తించారు. రోహిత్ తల, ముఖంతో పాటు మరికొన్ని చోట్ల గాయాలయ్యాయి. దీంతో ఎవరైనా హత్య చేసి చంపారా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు..
పోలీసులతో కుటుంబసభ్యులు మాట్లాడుతు ఇటీవల రోహిత్ పార్కింగ్ విషయంలో ముగ్గురు వ్యక్తులతో గొడవపడ్డాడని, వాళ్లే హత్య చేసి ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేసారు. కొన్ని నెలల క్రితమే ముంబై(MUmbai)నుంచి గౌహతి వచ్చిన రోహిత్ తన కెరీర్ లో షెర్డిల్, లాస్ట్, పడాటిక్, మహిషాసుర్ మర్దిని, ముఖోష్, కూలేర్ అచ్చార్ వంటి పలు చిత్రాల్లో నటించాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
