థాంక్యూ.. స్టోరీ లైన్ అదేనా?
on Jan 15, 2021

మనం వంటి మెమరబుల్ మూవీ తరువాత యువ సామ్రాట్ నాగచైతన్య, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం థాంక్యూ. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నాగచైతన్య సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తారని ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే.. థాంక్యూ స్టోరీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విడుదల సమయంలో థియేటర్ల దగ్గర కటౌట్ కట్టే స్థాయి నుంచి విదేశాల్లో బడా వ్యాపారవేత్త స్థాయికి ఎదిగిన ఓ యువకుడు.. తన ఎదుగుదలకు దోహదపడ్డ వారందరికీ థాంక్స్ చెప్పుకుంటూ రావడమే ఈ సినిమా థీమ్ అని సమాచారం. అలాగే హాకీ ప్లేయర్ గా చైతూ కనిపించడం అనేది కూడా సబ్జెక్ట్ తో ముడిపడి ఉంటుందట. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఈ ఏడాది ద్వితీయార్ధంలో థాంక్యూ థియేటర్స్ లో సందడి చేసే అవకాశముందని టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



