రాజా సాబ్ వాయిదా పడుతుందా.. ఫస్ట్ సింగిల్ అందుకే రిలీజ్ చేయట్లేదా..?
on Nov 20, 2025

ప్రభాస్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న రాజా సాబ్
విడుదలకు ఇంకా 50 రోజులే
ఇంతవరకు ఫస్ట్ సాంగ్ రాకపోవడానికి కారణం?
2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానున్న 'ది రాజా సాబ్'లో వింటేజ్ ప్రభాస్(Prabhas)ను చూడటం కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్ విడుదలకు ఇంకా 50 రోజులే సమయముంది. అయినప్పటికీ ప్రమోషన్స్ లో జోరు కనిపించడంలేదు. ముఖ్యంగా ఇంతవరకు ఒక్క సాంగ్ కూడా విడుదల కాలేదు. ఇదే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. అసలు సాంగ్స్ ఎందుకు విడుదల చేయడం లేదనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది. (The Raja Saab)
తమన్ సంగీతం అందిస్తున్న 'ది రాజా సాబ్'లో మొత్తం ఐదు పాటలు ఉన్నాయట. ఒక హీరో ఇంట్రో సాంగ్, ఒక మాంటేజ్ సాంగ్, రెండు డ్యూయెట్ సాంగ్స్ తో పాటు.. ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ చిందేసే మాస్ సాంగ్ ఒకటి ఉందట.
రాజా సాబ్ ఆల్బమ్ అదిరిపోయిందని అంటున్నారు. ఇప్పటికే ఐదు పాటల్లో మూడు పాటల లిరికల్ వీడియోలు కూడా రెడీ అయ్యాయని సమాచారం. ఫస్ట్ సింగిల్ గా హీరో ఇంట్రో సాంగ్ ని విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.
రాజా సాబ్ లో ఒక రీమిక్స్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ కాపీ రైట్ ఇష్యూ కారణంగానే.. పాటల విడుదల ఆలస్యమైందని తెలుస్తోంది. అయితే టి-సిరీస్, సరిగమ మధ్య నెలకొన్న ఈ ఇష్యూ ఇప్పుడు పరిష్కారమైందని వినికిడి.
అన్నీ అనుకున్నట్టు జరిగితే.. రాజా సాబ్ మొదటి సాంగ్ నవంబర్ 25 లేదా 27న విడుదల కానుందట. ఆ తర్వాత నుండి ప్రతి వారం ఒక సాంగ్ ని విడుదల చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ న్యూస్.. సందీప్ రెడ్డి మాట నిలబెట్టుకుంటాడా..?
ప్రభాస్ ఇప్పటికే రాజా సాబ్ షూటింగ్ పూర్తి చేశాడు. ప్రభాస్ లేని ఒక చిన్న సీక్వెన్స్ షూట్ చేస్తే చాలు.. ఇక మొత్తం షూటింగ్ పూర్తయినట్లే. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా తుది దశలో ఉంది.
రాజా సాబ్ ప్రమోషన్స్ మొదలు కాకపోవడంతో.. అసలు ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, అలాంటి డౌట్స్ అక్కర్లేదని, వచ్చే వారం నుండి రాజా సాబ్ జాతర మొదలవుతుందని చెబుతున్నారు.
అంతేకాదు, ప్రతి వారం ఒక సాంగ్ ని రిలీజ్ చేయడమే కాకుండా.. సినిమా విడుదలకు సరిగ్గా వారం ముందు కొత్త ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



