The Raja Saab Movie Review : ది రాజాసాబ్ మూవీ రివ్యూ
on Jan 8, 2026

-సినిమా పేరు: ది రాజాసాబ్
-నటీనటులు: ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, జరీనా వాహెబ్, -బొమన్ ఇరానీ, సముద్ర ఖని, వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య తదితరులు
-సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని
-ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
-మ్యూజిక్: థమన్
-నిర్మాత: టిజి విశ్వప్రసాద్
-బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
-రచన, దర్శకత్వం: మారుతీ
-రిలీజ్ డేట్ : జనవరి 9 ,2025
అభిమానులు, మూవీ లవర్స్ కోలాహలం మధ్య పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ బెనిఫిట్ షోస్ తో రాజాసాబ్ గా సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. ప్రభాస్ ఫస్ట్ టైం హర్రర్ కామెడీ చెయ్యడంతో పాటు రిలీజ్ కి ముంచే పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం రాజా సాబ్ స్పెషాలిటీ.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
రాజు అలియాస్ రాజాసాబ్ (ప్రభాస్) తన నాయనమ్మ గంగా దేవి(జరీనా వాహెబ్) తో కలిసి ఉంటుంటాడు. గంగాదేవి అల్జీమర్స్ అనే వ్యాధితో అందర్నీ మర్చిపోయినా సరే తన భర్త కనకరాజు (సంజయ్ దత్) మనవడు రాజుని మాత్రం గుర్తుంచుకుంటుంది. దేవనగర సామ్రాజ్యానికి నమ్మిన బంటు గంగరాజు(సముద్ర ఖని) ద్వారా రాజుకి తన తాత కనకరాజు గురించి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. దీంతో తన తాత కనకరాజు ని అంత మొందించాలని రాజు ఫిక్స్ అవుతాడు. రాజు ఎందుకు తన తాత ని చంపాలని అనుకుంటాడు? కనకరాజు మంచి వ్యక్తా? చెడ్డ వ్యక్తా? కనకరాజు గతం ఏంటి? హీరోయిన్స్ గా చేసిన బెస్సి, అనిత, భైరవి ల క్యారెక్టర్స్ ఏంటి? అసలు రాజా సాబ్ కథ వెనక ఉన్న ఉద్దేశ్యం ఏంటనేదే చిత్ర కథ
ఎనాలసిస్
దర్శకుడు మారుతి ప్రభాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ కథని రాసుకున్నాడని స్టార్టింగ్ నుంచి వచ్చిన ప్రతి సీన్ ద్వారా అర్ధమవుతుంది. కానీ గందరగోళానికి గురయ్యి ఒక మంచి కథకి అన్యాయం చేసాడేమో అనిపిస్తుంది.. నాయనమ్మ కోరిక తీర్చిన మనవడు అనే కాన్సెప్ట్ కొత్తగానే ఉన్నా స్క్రీన్ ప్లే లో ఎన్నో లోపాలు ఉన్నాయి . ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే ప్రభాస్ ఇంట్రడక్షన్ నుంచి మిగతా అన్ని క్యారెక్టర్స్ సీన్స్ నేటి ట్రెండ్ కి తగ్గట్టు విధంగా ఉండి ఫాస్ట్ గానే ఉన్నాయి. కాకపోతే గంగా దేవి సామ్రాజ్యం గురించి కథ ని చెప్పాల్సింది.
దాంతో కొత్త లుక్ వచ్చేది. బెస్సీ, అనిత భైరవి క్యారెక్టర్స్ యొక్క ప్లేస్ మెంట్ కూడా బాగుంది. కాకపోతే వీళ్ళని ఎక్కువగా ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది. రాజు,గంగా దేవి మధ్య వచ్చిన సీన్స్ బాగున్నాయి. కనకరాజు, గంగా దేవి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో పెద్ద ట్విస్ట్ ఏం లేదు. సెకండ్ ఆఫ్ చూసుకుంటే కథ ఎక్కువ భాగం ఒక ఫారెస్ట్‌లోని కోట చుట్టూ తిరిగి పరుల సొమ్ము కోసం ఆశపడే కనకరాజు తన మాయాజాలంతో అందరి నుంచి డబ్బులు దోచుకుని దాన్ని కోటలో దాచుకోవడం, చనిపోయిన తర్వాత కూడా ఆ సొమ్మంతా తనకే దక్కాలని, ఆ సంపదకు వారసుడు తాను మాత్రమేనని, ఇంకెవరికీ దక్కకూడదని ముందే వీలునామా రాసుకోవడం వంటి సీన్స్ ఆసక్తి రేపాయి.
చనిపోయి ఆత్మగా మారిన తర్వాత తన భార్యని చంపాలని ప్రయత్నిస్తుండటం ఉత్కంఠని కలిగిస్తుంది. ఈ సందర్భంగా ప్రభాస్ తో వచ్చే సీన్స్, కోటలోకి బెస్సి, అనిత, భైరవి లని ఇన్ క్లూడ్ చేసిన విధానం బాగుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయి
నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు
రాజా సాబ్ తో మరో సారి పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద ఎంత వాల్యుబుల్ స్టార్ నో ప్రభాస్ చాటి చెప్పాడు. తన క్యారక్టర్ వరకు అత్యద్భుతంగా చేసి కథనం యొక్క వేగాన్ని జెట్ స్పీడ్ వేగంతో తీసుకెళ్లాడు.సదరు క్యారక్టర్ లో ప్రభాస్ ని తప్ప మరొకర్ని ఊహించలేం. ఎంటర్ టైన్ మెంట్ లో కూడా కింగ్ ని అని చెప్పినట్లయింది ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు చాన్నాళ్ల తర్వాత వింటేజ్ ప్రభాస్‌ని చూస్తారు. ఏ విషయాన్నైనా సరదాగా తీసుకుంటూ బాగా వెటకారం కలగలిపిన క్యారెక్టర్‌లో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడు. నాయనమ్మ కోసం ఎంతకైనా తెగించే మనవడిగా, ముగ్గురు భామల మధ్యలో ఇరుక్కున్న ప్రియుడిగా, తాత నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత అతడిని ఎలాగైనా అంతమొందించాలన్న పట్టుదలతో ప్రాణాలను సైతం లెక్కపెట్టక పోరాడే వ్యక్తిగా ప్రభాస్ అలరించాడు. హీరోయిన్స్ గా చేసిన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లు గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా మెప్పించారు. కనకరాజుగా సంజయ్ దత్ ది బెస్ట్ పెర్ ఫార్మ్ ఇవ్వడమే కాకుండా తన కెరీర్ లోనే రాజా సాబ్ మరో మెమొరీబుల్ మూవీగా ఉండేలాగా చేసుకున్నాడు.
మిగతా క్యారెక్టర్స్ లలో చేసిన బొమన్ ఇరానీ. సముద్ర ఖని తో పాటు అందరు మెస్మరైజ్ చేసే పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. సాంగ్స్ కి థమన్ ఇచ్చిన మ్యూజిక్ ని స్క్రీన్ పై చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక రేంజ్ లో ఉంది. ప్రతి సీన్ ని కూడా ఎంతో ఎలివేట్ చేస్తు సాగి ఒక కొత్త లోకాన్ని పరిచయం చేసింది. గ్రాఫిక్ నిపుణుల పని తనం ఐ ఫీస్ట్ అనుభూతిని కలిగించింది. ఇక దర్శకుడిగా మారుతి నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు కానీ రచయితగా తడపడ్డాడు పీపుల్ మీడియా నిర్మాణ విలువలు ఒక రేంజ్ లో ఉన్నాయి. రాజా సాబ్ తో దర్జాగా భారతీయ చిత్ర పరిశ్రమలో టాప్ బ్యానర్ గా తమ సంస్థ పేరుని ఉండేలా చేసుకుంది . కార్తీక్ పళని ఫొటోగ్రఫీ అయితే ఎక్స్ లెంట్
ఫైనల్ గా చెప్పాలంటే కథనంలో లోపాలు ఉన్నా ప్రభాస్ పెర్ ఫార్మెన్స్ మాత్రం సూపర్ గా ఉంది.
రేటింగ్ : 2.5/5
- అరుణా చలం
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



