ది రాజా సాబ్.. ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్!
on Oct 23, 2025

2026 సంక్రాంతికి 'ది రాజా సాబ్'(The Raja Saab)తో ప్రేక్షకులను పలకరించనున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas). విడుదలకు రెండు నెలలే సమయముంది. నేడు(అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ తో సర్ ప్రైజ్ చేసింది మూవీ టీమ్. ఈ సినిమాకి సంబంధించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
'ది రాజా సాబ్' షూటింగ్ దాదాపు పూర్తయిందట. ఇటీవల విదేశాల్లో సాంగ్స్ షూట్ చేశారు. దాంతో ప్రభాస్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిందని అంటున్నారు. ప్రభాస్ లేని ఒక ఫైట్ సీన్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. ఈ చిత్రీకరణ కూడా పూర్తయితే.. ఇక మొత్తం షూట్ కంప్లీట్ అయినట్లేనట. ఇది కూడా మరో వారం రోజుల్లో పూర్తవుతుందని సమాచారం.
రాజా సాబ్ లాంటి వీఎఫ్ఎక్స్ తో ముడిపడి ఉన్న భారీ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి చాలా సమయం పడుతుంది. అయితే పారలల్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చేస్తూ వచ్చారు. దీంతో ఇప్పటికే మెజారిటీ వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా పూర్తయిందంట. ఇప్పటిదాకా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని చెబుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



