తరుణ్ భాస్కర్ పాన్ ఇండియా ఫిల్మ్ మొదలైంది!
on Aug 23, 2022

'పెళ్లి చూపులు'(2016), 'ఈ నగరానికి ఏమైంది'(2018) సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. ఆ తర్వాత నటుడిగా, రచయితగా వరుస సినిమాలు చేస్తూ డైరెక్షన్ కి కాస్త బ్రేక్ ఇచ్చాడు. నాలుగేళ్ళ తర్వాత ఎట్టకేలకు ఆయన దర్శకత్వంలో రానున్న మూడో సినిమాను ఇటీవల ప్రకటించాడు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనున్న ఈ చిత్రానికి 'కీడా కోలా' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టాడు. తాజాగా ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది.
మంగళవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన 'కీడా కోలా' మూవీ లాంచ్ కి సురేష్ బాబు, సిద్ధార్థ్, ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ, సుహాస్, సందీప్ రాజ్, గౌతమ్ తదితరులు హాజరయ్యారు. వీజీ సైన్మా బ్యానర్ నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఈ సినిమాకి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. మొదటి రెండు సినిమాలకు విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ వంటి యంగ్ హీరోలతో పని చేసి వారి కెరీర్ కి బూస్ట్ ఇచ్చిన తరుణ్.. ఈసారి ఎవరితో పనిచేయబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



