తమ్ముడు పరిస్థితి ఏంటి.. నితిన్ హిట్ కొట్టాడా..?
on Jul 4, 2025
సినీ పరిశ్రమలో నిలబడాలంటే హిట్లు కీలకం. ముఖ్యంగా హీరోలకు వరుస పరాజయాలు ఎదురైతే నిలదొక్కుకోవడం కష్టం. అలాంటిది వరుసగా పదికి పైగా ఫ్లాప్ లు వచ్చినా.. నిలబడగలిగిన హీరో నితిన్.
కెరీర్ స్టార్టింగ్ లో 'జయం', 'దిల్', 'సై' వంటి విజయాలు అందుకున్న నితిన్.. ఆ తర్వాత వరుసగా 12 ఫ్లాప్ లు చూశాడు. అన్ని ఫ్లాప్ ల తర్వాత హీరోగా నిలబడటం అనేది మామూలు విషయం కాదు. కానీ, నితిన్ నిలబడ్డాడు. ఆ తర్వాత 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'అఆ', 'భీష్మ' వంటి సినిమాలతో సత్తా చాటాడు. అయితే మళ్ళీ నితిన్ కొన్నేళ్లుగా ఫ్లాప్స్ లో ఉన్నాడు. నితిన్ గత ఐదు చిత్రాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా మిలిగాయి. దీంతో తన తాజా చిత్రం 'తమ్ముడు' పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం 'తమ్ముడు'. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం నేడు(జూలై 4) థియేటర్లలో అడుగుపెట్టింది. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు పూర్తయ్యాయి. మొదటి షోకి వస్తున్న టాక్ ని బట్టి చూస్తే.. మరోసారి నితిన్ కి నిరాశ తప్పలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు ఎంచుకున్న లైన్ బాగానే ఉందని.. కానీ, దానిని ఆసక్తికరంగా మలచలేకపోయాడని చెబుతున్నారు. ఇదే టాక్ కంటిన్యూ అయితే నితిన్ ఖాతాలో మరో ఫ్లాప్ పడినట్లే. మరి ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి.
నితిన్ తదుపరి చిత్రం 'ఎల్లమ్మ'. 'బలగం' ఫేమ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. దానికి కూడా దిల్ రాజే నిర్మాత. మరి దానితోనైనా నితిన్ కోరుకుంటున్న భారీ విజయం సొంతమవుతుందేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
