మహేష్ 27కు తమన్?
on Jan 20, 2020
రొటీన్ కమర్షియల్ మ్యూజిక్ చేస్తున్నాడని, రొట్ట పాటలు ఇస్తున్నాడని విమర్శలు ఎదుర్కొన్న సమయంలోనూ... సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు ఎస్.ఎస్. తమన్ సూపర్‌హిట్ పాటలే ఇచ్చాడు. ‘దూకుడు’లో మహేష్, సమంత డ్యాన్ ఇరగదీసిన ‘దఢక్ దఢక్ దేత్తడి’ పాట ఇప్పటికీ ఆటోల్లో అప్పుడప్పుడూ వినపడుతోంది. అలాగే, అందులో ఐటమ్ సాంగ్ ‘పూవై పూవై’... మహేష్, సమంత మధ్య మరో సాంగ్ ‘చుల్ బులీ’ హిట్టే. ఇవే కాదు... ఫ్లాప్ సినిమా ‘ఆగడు’లో ‘జంక్షన్‌లో’ వంటి హిట్ ఐటమ్ సాంగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ పాట పాటల విషయం ఎందుకంటే... మరోసారి మహేష్ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడని టాక్.
‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘మహర్షి’ తర్వాత వంశీతో మహేష్ చేస్తున్న సినిమా ఇది. ప్రజెంట్ మూడు నెలలు మహేష్ బ్రేక్ తీసుకోనున్నాడు. ఆ తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. దానికి తమన్‌ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారట. ఇదే నిజమైతే... మహేష్ సినిమాలో కొత్త మ్యూజిక్ వినే ఛాన్స్ ఫ్యాన్స్ వస్తుంది. మహేష్ లాస్ట్ మూడు సినిమాలకు దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ చేశాడు. అతడిని మహేష్ విపరీతంగా పొగుడుతున్నాడు. ఫ్యాన్స్‌లో మాత్రం దేవీశ్రీపై నెగెటివ్ ఫ్యీడ్‌బ్యాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ మారడం వాళ్ళకు సంతోషానిచ్చే విషయమే. పైగా, సంక్రాంతి కాంపిటీషన్‌లో ‘అల... వైకుంఠపురములో’కు తమన్ మ్యూజిక్ ప్లస్ అయితే, ‘సరిలేరు నీకెవ్వరు’కు ఆ స్థాయిలో మ్యూజిక్ ఇవ్వని దేవిశ్రీ మైనస్ అయ్యాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
