టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!
on May 4, 2025

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత జవాజి వెంకట రామారావు అలియాస్ తేనెటీగ రామారావు (68) కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం(మే 4) మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. (Teneteega Rama Rao)
రాజేంద్రప్రసాద్ తో 'తేనెటీగ' అనే సినిమాను నిర్మించారు జె.వి.రామారావు. అలా ఆయన పేరు తేనెటీగ రామారావుగా మారిపోయింది. నరేష్, వాణీ విశ్వనాధ్ జంటగా వంశీ దర్శకత్వంలో వచ్చిన 'ప్రేమ & కో' చిత్రాన్ని కూడా రామారావు నిర్మించారు. అలాగే 'బొబ్బిలివేట', 'బడి' వంటి స్ట్రెయిట్ సినిమాలతోపాటు.. పలు డబ్బింగ్ చిత్రాలకు కూడా ఆయన నిర్మాతగా వ్యవహరించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



