మరో వసంతంలో ‘తెలుగువన్’
on May 9, 2015
‘తెలుగువన్’ తెలుగువారికి సుపరిచితమైన మాట. తెలుగువారందరూ ఒక్కటిగా వుండాలని కోరుకునే పదం. ఇంటర్నెట్ ప్రపంచంలో చిరకాలంగా తెలుగువారికి ‘తెలుగువన్’ ఒక ఆత్మీయ నేస్తంగా వుంది. రాజకీయ, సినిమా వార్తలు, ఆకట్టుకునే వీడియోలు, తెలుగువారి ఆత్మీయ వారధి ‘టోరి’, పిల్లల కోసం, మహిళల కోసం, హాస్య ప్రియుల కోసం.... ఇలా అన్ని వర్గాల తెలుగువారికి వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించడానికి ‘తెలుగువన్’ గత 15 సంవత్సరాలుగా విశేషకృషి చేస్తోంది. తెలుగువారి ఆదరాభిమానాలతో విజయపథంలో దూసుకుపోతోంది. ఇక ‘తెలుగువన్ ఫౌండేషన్’ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఎంతోమంది పేదవారి కన్నీరును తుడుస్తున్నాయి. ఇందుగలదు అందు లేదను సందేహము వలదన్నట్టుగా ‘తెలుగువన్’ తెలుగువారి జీవితాలలో మమేకమై పదిహేను వసంతాలు పూర్తయింది. ఈ శుభ సందర్భంలో తెలుగువారందరినీ ఒక్కటిగా వుంచే తన సంకల్పానికి ‘తెలుగువన్’ పునరంకితమవుతుందని మరోసారి సవినయంగా తెలియజేస్తున్నాం.