మీటింగ్ లు, షూటింగ్ లు ఆపండి.. ఫిల్మ్ ఛాంబర్ సంచలన ప్రకటన!
on Aug 8, 2025

సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఒకేసారి అంత మొత్తంలో వేతనాలు పెంచడానికి నిర్మాతలు సుముఖంగా లేరు. మరోవైపు ఫెడరేషన్ ఏక పక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంపై ఇప్పటికే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఫిల్మ్ ఛాంబర్ మరో సంచలన ప్రకటన చేసింది. ఛాంబర్ నుండి తదుపరి సూచనలు వచ్చే వరకు యూనియన్లతో నిర్మాతలు సంప్రదింపులు జరపవద్దని ఆదేశించింది. స్టూడియోలు సైతం ఎలాంటి సేవలూ అందించకూడదని స్పష్టం చేసింది.
"తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఏకపక్ష సమ్మెకు పిలుపునిచ్చిన దృష్ట్యా.. యూనియన్లతో చర్చలు లేదా సంప్రదింపులు జరపకుండా ఉండాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులకు సూచిస్తున్నాము. ఫిల్మ్ ఛాంబర్ నుండి అనుమతి లేకుండా ఎలాంటి సేవలూ అందించకూడదని.. స్టూడియోలు, ఔట్డోర్ యూనిట్లకు కూడా కఠినమైన ఆదేశాలు జారీ చేస్తున్నాము. ఫిల్మ్ ఛాంబర్ నుండి తదుపరి సూచనలు వచ్చే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. నిర్మాతలు మరియు స్టూడియో విభాగ సభ్యులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని పాటించాలి." అంటూ ఫిల్మ్ ఛాంబర్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



