పవన్ కళ్యాణ్ కి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్
on Jul 21, 2025

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)ఈ నెల 24 న తన కొత్త మూవీ 'హరిహరవీరమల్లు'(Hari Hara Veeramallu)తో వరల్డ్ వైడ్ గా తన సత్తా చాటడానికి సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో వీరమల్లుకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా పవన్ కళ్యాణ్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొని వీరమల్లు ఘన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు. అభిమానులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమం ఆధ్యంతం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది.
తెలంగాణా(Telangana)రాష్ట్రంలో వీరమల్లుకి సంబంధించిన షో వివరాలు, టికెట్ రేట్స్ పై తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రత్యేక జీవో ఒకటి విడుదల చేసింది. సదరు జీవో ప్రకారం వీరమల్లు ఇరవై మూడవ తారీకు రాత్రి 9 గంటలకి బెనిఫిట్ షో ప్రదర్శించనుండగా, టికెట్ రేట్ 600 రూపాయిలు ఉండనుంది. ఈ అమౌంట్ కి జి ఎస్ టి అదనం. ఇక ఇరవై నాలగవ తారీకు నుంచి ఇరవై ఏడవ తారీకు వరకు ఐదు షోస్ కి అనుమతి ఇస్తు, మల్టిప్లెక్స్ కి 200 రూపాయిలు, సింగల్ థియేటర్స్ కి 150 రూపాయలు, ఇరవై ఎనిమిదవ తారీకు నుంచి ఆగస్టు 2 వరకు మల్టి ప్లెక్స్ 150 , సింగల్ థియేటర్ 106 రూపాయిలు పెంచుకునేలా అనుమతి ఇచ్చింది. జిఎస్ టి అదనం .
వీరమల్లు ని ఎ ఏం రత్నం(A M rathnam)అత్యంత భారీ వ్యయంతో నిర్మించగా నిధి అగర్వాల్(Nidhhi Agerwal), నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి, రఘుబాబు, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జ్యోతికృష్ణ దర్శకుడు కాగా ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



