40 కోట్లకి పెరిగింది.. మరి హనుమాన్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కదా!
on Apr 4, 2024

ఒక్క హిట్ తో సినిమా పరిశ్రమలో ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. తెలుగు సినిమా మొత్తం మన వైపుకి తిరిగేలా కూడా చెయ్యవచ్చు. చెయ్యడమే కాదు మన కోసం సిస్టమ్ మారేలా కూడా చెయ్యవచ్చు. తాజాగా యువ నటుడు తేజ సజ్జ(teja sajja) విషయంలో సేమ్ అదే జరుగుతుంది. హిట్ కి ఉన్న శక్తీ అలాంటిది మరి.
తేజ రీసెంట్ గా హనుమాన్ (hanuman)తో భారీ విజయాన్ని అందుకున్నాడు. హీరోగా కెరీర్ మొదలుపెట్టిన కొత్తలోనే పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళాడు.మరి 300 కోట్లు సాధించడం అంటే మాటలా చెప్పండి. ఇక అసలు విషయానికి వస్తే తేజ ప్రస్తుతం మిరాయ్(mirai)అనే మూవీ చేస్తున్నాడు. హనుమాన్ రిలీజ్ కంటే ముందే ఈ చిత్రానికి కమిట్ అయ్యాడు. రవితేజ తో ఈగల్ తెరకెక్కించిన కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి మొదట ఒక బడ్జట్ ని అనుకున్నారు. కానీ ఇప్పుడు హనుమాన్ తో తేజ క్రేజ్ పెరగడంతో బడ్జట్ లో మార్పులు జరిగాయనే వార్త హల్ చల్ చేస్తుంది.
40 కోట్లతో మిరాయ్ ని తెరకెక్కిస్తున్నారనే ప్రచారం అయితే సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది.క్వాలిటీ కోసమే మేకర్స్ ఆ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.మంచు మనోజ్ తొలిసారిగా నెగెటివ్ షేడ్స్ ఉన్నక్యారక్టర్ ని పోషిస్తున్నాడు. మిరాయ్ అనేది ఒక జపనీస్ వర్డ్ కి సంబంధించింది. సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. అశోక వనంలో అర్జున కళ్యాణం ఫేమ్ రితిక హీరోయిన్ గా చేస్తుంది. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ రాబోతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



