గంగను నమ్ముకున్న తెల్లపిల్ల
on Apr 16, 2015
.jpg)
ఝుమ్మందినాదంలో కర్లీ హెయిర్ బ్యూటీని చూసి కత్తిలా ఉంది కంటిన్యూ అవుతుందిలే అనుకున్నారంతా. కానీ ఆఫర్స్ అయితే వచ్చాయి కానీ ఒక్కటీ గుర్తింపునిచ్చే పాత్ర దక్కలేదు. పైగా ఐరెన్ లెగ్ అనే ముద్రవేసేశారు. అడపా దడపా సినిమాలు హిట్టైనా ఆ క్రెడిట్ హీరోల ఖాతాల్లోకి వెళ్లిపోయిందాయె. దీంతో కేవలం టాలీవుడ్ నే నమ్ముకోకుండా అన్ని వుడ్స్ పైనా దృష్టిపెట్టింది. లేటెస్ట్ గా లారెన్స్ తెరకెక్కించిన కాంచన సీక్వెల్ గంగలో కీ రోల్ ప్లే చేసింది తాప్సీ. ఈ సినిమాకోసం రెండేళ్లు కష్టపడ్డాఅని తగిన గుర్తింపు దక్కుతుందని గలగలా చెప్పేస్తోందట. చివరికి 9 గంటలపాటూ స్విమ్మింగ్ పూల్ లో ఉండి స్కిన్ ఇన్ ఫెక్షన్ కూడా వచ్చిందని....షూటింగ్ లో కష్టాలు ఏకరువు పెడుతోంది. అంతేనా గంగ మూవీకోసం ఎన్నో ఆఫర్స్ వదులుకుందట. ఇదంతా ఎందుకుతల్లీ అంటే....గంగ అదిరిపోద్దని....తన కెరీర్ ని టర్నింగ్ తిప్పేస్తుందని భారీ ఆశలు పెట్టుకుంది. మరి అమ్మడి ఆశల ఏ మేరకు నెరవేరుతాయో తెలియాలంటే గంగ విడుదల వరకూ ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



