వేధిస్తున్నారంటు బోరున ఏడుస్తున్న ప్రముఖ హీరోయిన్.. ఆ హీరో అభిమానులా!
on Jul 23, 2025

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)దివంగత దర్శకుడు 'ఏఎస్ రవికుమార్ చౌదరి'(As Ravikumar Chowdary)కాంబినేషన్ లో వచ్చిన 'వీరభద్ర' అనే మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన బాలీవుడ్ నటి 'తనుశ్రీ దత్తా'. 2007 లో హిందీ సినీ రంగ ప్రవేశం చేసిన తనుశ్రీ పలు చిత్రాల్లో ప్రాధాన్యత గల పాత్రలని పోషించి, మంచి నటిగా గుర్తింపు పొందింది.
రీసెంట్ గా తనుశ్రీ దత్తా(Tanushree Dutta)సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆమె కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడుతు నా ఇంటికి కొంత మంది వచ్చి నన్ను వేధించడంతో పాటు, బూతులు తిడుతు నరకం చూపిస్తున్నారు. నా ఆరోగ్యం దెబ్బతింది. ఎవరైనా సాయం చేయండంటూ భోరున విలపిస్తుంది. తనుశ్రీ గతంలో ప్రముఖ హీరో, లెజండ్రీ యాక్టర్ 'నానాపటేకర్'(Nanapatekar)పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయగా, కోర్టు కేసుని కొట్టి వేసింది. దీంతో అప్పట్నుంచి నానా పటేకర్ మనుషులు తనని వేదిస్తున్నారంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
నానాపటేకర్ నటించిన పలు సినిమాలు విడుదలకి ఉన్న నేపథ్యంలో తనుశ్రీ వీడియో బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తుంది. తనుశ్రీ 2005 లో 'ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్'ని గెలుచుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



