`వాల్మీకి` లో తమిళ హీరో!!
on Mar 26, 2019
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వాల్మీకి మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ జిగర్ తాండ కు తెలుగు రీమేక్ వెర్షన్ వాల్మీకి మూవీ. ఈ మూవీ లో వరుణ్ తేజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించడం విశేషం. మృణాళిని రవి కథానాయిక. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఏప్రిల్ నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న వాల్మీకి మూవీ లో తమిళ హీరో అథర్వ మురళి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సూపర్ హిట్ తమిళ మూవీ పరదేశి లో నటించి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న అథర్వ మురళి, పరదేశి మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ పరదేశి , రీసెంట్ గా రిలీజయిన అంజలి CBI మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
