టాక్ ఆఫ్ ది టౌన్ తమన్నా సెల్ఫీలు
on Jan 27, 2016
మిల్కీ బ్యూటీ తమన్నాతో సెల్ఫీ దిగాలని అనుకోని సినీ అభిమానులు ఉండరేమో..కానీ తమన్నా మాత్రం నాగార్జున,మహేష్ బాబులతో్ సెల్ఫీ దిగి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. తారల తళుకుబెళుకులతో, అద్భుతంగా రెండ్రోజుల పాటు సాగిన ఐఫాలో,రామ్ చరణ్, తమన్నా, అఖిల్ లాంటి స్టార్స్ అందరూ స్టేజ్ పై డ్యాన్స్ లతో అలరించారు. ' ధీవర ' పాటను అభినయిస్తూ,దేవకన్యలా స్టేజ్ పైకి దిగిన తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె అందాన్ని, అభినయాన్ని చూడటానికి అక్కడికొచ్చిన వారికి రెండు కళ్లూ చాలలేదు. చివరిపాటగా 'సెల్ఫీ పుళ్లా' సాంగ్ కు స్పెప్పులు వేసిన తర్వాత, పనిలో పనిగా కిందికి దిగి, నాగార్జునతోనూ, మహేష్ బాబుతోనూ సెల్ఫీలు దిగి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అది కూడా డ్యాన్స్ లో ఒక భాగమే..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



