పరశురామ్ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అన్న చైతూ!
on May 6, 2023

డైరెక్టర్ పరశురామ్ పై నేరుగా తన మనసులో మాట బయట పెట్టేశాడు నాగచైతన్య. అతని గురించి మాట్లాడటం టైం వేస్ట్ అని తేల్చేశాడు. రెండేళ్ల క్రితం పరశురామ్, చైతు కాంబినేషన్‌లో ఒక సినిమా రావాల్సింది. కానీ మహేశ్‌తో పనిచేసే చాన్స్ రావడంతో చైతూకు ఝలక్ ఇచ్చాడు పరశురామ్. అతను చెప్పిన కథ నచ్చి, సినిమా చేయడానికి ఓకే అన్నాడు చైతూ. ఆ సినిమా కోసం నాగేశ్వరరావు అనే టైటిల్‌ని కూడా పరశురామ్ రిజిస్టర్ చేయించాడు.
ఆ సినిమా షూటింగ్ కొద్ది రోజుల్లో మొదలవ్వాల్సి వుండగా, మహేశ్‌తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది పరశురామ్. దాంతో నాగేశ్వరరావు ప్రాజెక్టును పక్కనపెట్టి, సర్కారువారి పాటను చేశాడు. ఆ సినిమా రిలీజయ్యాక, చైతూతో సినిమా చెయ్యాలని ప్రయత్నించాడు. కానీ అప్పటికే అతని ధోరణితో హృదయం గాయపడిన చైతూ అతడితో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపలేదు.
తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరశురామ్ గురించి మాట్లాడటానికి అతను ఇష్టపడలేదు. "అతని గురించి మాట్లాడి టైం వేస్ట్ చెయ్యాలని నేననుకోవట్లేదు. అతను నా టైంను నాశనం చేశాడు. దాని గురించి బాధపడుతూ నా టైంను వేస్ట్ చెయాలని అనుకోవట్లేదు" అని చెప్పాడు చైతూ. అంటే.. సమీప భవిష్యత్తులో పరశురామ్ తో అతను పనిచేసే అవకాశమే లేదని అర్థమైపోయింది.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతూ నటించిన కస్టడీ మూవీ మే 12న విడుదలవుతోంది. మరోవైపు దిల్ రాజు ప్రొడక్షన్‌లో విజయ్ దేవరకొండను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు పరశురామ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



