తెలుగు సినిమా మారదా..!
on Apr 16, 2016
.jpg)
పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్న సామెతను గుర్తుకు తెస్తూ తెలుగు సినిమా అప్పుడప్పుడూ అలాగే బీహేవ్ చేస్తుంటుంది. ఒక సినిమా ఒక ఫార్మూలాతో హిట్‌తో అయితే అదే ఫార్మూలాతో సినిమాలు దండయాత్రలు చేస్తాయి. ప్రేమ..ఫ్యాక్షన్..కామెడీ..డ్రామా..సస్పెన్స్..హార్రర్ ఇలా ఏ జోనర్‌లో సినిమా హిట్టయితే ఆ ఫార్మాట్‌లోనే సినిమాలు వెండితెర మీద దండయాత్ర చేస్తాయి. ఇలా వచ్చిన వాటిలో కొన్ని సినిమాలు సక్సెస్ అయితే మరికొన్ని వచ్చినట్టుగా తెలియదు. సినిమా కథల విషయంలోనే కాదు ఆయా సినిమాల్లో హీరోల స్టైల్, బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్ అన్నీ మక్కికి మక్కీ దించేస్తారు మన రైటర్స్ కమ్ డైరెక్టర్స్.
రీసెంట్‌గా నాగార్జున నటించిన ఊపిరి సినిమా రోటిన్‌కి భిన్నంగా ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. ముఖ్యంగా నవ్విస్తూ..అక్కడక్కడా ఎమోషన్‌తో కళ్లతోనే ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ సినిమా మొత్తం వీల్ ఛెయిర్‌లో కూర్చునే పాత్రలో ఒదిగిపోయారు నాగార్జున. ఈ సినిమా వచ్చి నెల తిరక్కుండానే నాగ్ క్యారెక్టర్‌ను దించేశాడు రాజీవ్ కనకాల. జబర్దస్త్ రేష్మి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం చారుశీల. సస్పెన్స్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో రాజీవ్ వీల్‌చైర్‌లోనే కనిపించనున్నాడు. మరి నాగ్‌లాగా రాజీవ్ ఆ పాత్రను పోషించగలడా..? అయినా ఊపిరి థీమ్ వేరు? చారుశీల థీమ్ వేరు కాబట్టి సినిమా రీలీజైన తర్వాతే ఎవరికైనా మార్కులు వేయాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



